ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :కల్వర్టు నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిన రియల్టర్ టిడిపి ఆందోళన నేపథ్యంలో స్పందించాడు. కల్వర్ట్ నిర్మాణ పనులు చేపట్టారు. మండలంలోని చింతోపు-పేడూరు లింకురోడ్డు ప్రాంతంలో తేజు డెవలపర్ రియల్ ఎస్టేట్ యాజమాన్యం ఓ వెంచర్ నిర్మిస్తున్నారు. ఈ వెంచర్ కు వచ్చే ప్రధాన మార్గాన్ని వెడల్పు చేసే ఉద్ధేశ్యంతో ఇరిగేషన్ కాలువపై ఉన్న కల్వర్టును కూల్చివేసి దాని స్థానంలో కొత్త కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టకుండా అసంపూర్తిగా వదిలేశారు. అసంపూర్తిగా వున్న ఆ కల్వర్ట్లో రెం డు రోజుల కిందట ఓ ట్రాక్టర్, ఓ గేదె ప్రమాదానికి గురయ్యాయి. దాంతో చింతోపు గ్రామానికి చెం దినటిడిపి నాయ కులు పైనం కోటేశ్వరరావు సా రథ్యంలో గ్రామస్థులు 20న ఆందోళన చేప ట్టారు. ఈ నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్వర్ట్ నిర్మాణం పనులు ప్రారంభించారు.