ప్రజాశక్తి -యు.కొత్తపల్లి
విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి సిహెచ్.పద్మ అన్నారు కొత్తపల్లి సిఐటియు కార్యాలయంలో మంగళవారం సమావేశం సిఐటియు మండల కార్యదర్శి కె.నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.పద్మ హాజరై మాట్లాడుతూ. ఈ నెల 27, 28 వ తేదీల్లో విజయవాడలో జరగనున్న 'మహాపడావ్' కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాటించవలసిన విధివిధానాలను చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టెందుకు ప్రజలంతా సమయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జి.అప్పారెడ్డి, కెవివి.సత్యనారాయణ, బిల్డింగ్ వర్కర్స్ మండల కార్యదర్శి సిహెచ్ఎస్ఎస్.కుమార్, లక్ష్మి, ఆశజ్యోతి, జి. శ్రీను పాల్గొన్నారు
పెద్దాపురం కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27 , 28 తేదీలలో విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు.జట్లు వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి)ఆధ్వర్యంలో గురువారం జట్లు వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు గోకేడ బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, జట్లు వర్కర్స్ యూనియన్ నాయకులు కన్నూరి వెంకన్న,బొడ్డు శ్రీనివాస్,ఎస్ ఏడుకొండలు,శ్రీనివాస్,పల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు.