Nov 19,2023 22:29

ప్రజాశక్తి - భట్టిప్రోలు
చేనేత కార్మికులకు మంగళగిరిలో పెంచిన మాదిరిగా మజూరిని పెంచాలని డిమాండ్ చేస్తూ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా సోమవారం నిర్వహిస్తున్నట్లు చేనేత కార్మిక సంఘం ఐక్య వేదిక నాయకులు మురుగుడు సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీలు తెలిపారు. చేనేత కార్మికులకు మజురీ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి పదిహేను శాతం మజూరి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని చేనేత కార్మికులు ధర్నాకు హాజరు కావాలని కోరారు. సమావేశంలో నాయకులు మర్రివాడ వెంకటరావు, బట్టు నాగమల్లేశ్వరరావు, దొంతు శ్రీనివాసరావు పాల్గొన్నారు.