కడప : 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకం మత్స్యకార కుటుంబాల్లో ఆర్థిక భరోసాను నింపుతోందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి. శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తీర ప్రాంత మత్స్యకారులకు ఒన్‌జిసి బాధితులకు పరిహారాన్ని అంద జేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్ర మాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు స్థానిక కలెక్టరేట్ స్పందన హాలు నుంచి జిల్లా ఫిషరీస్ డిడి రామలింగాచార్యులు తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి. శివ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట సుబ్బమ్మ, జిల్లా మత్స్యకార సంఘం ఉపాధ్యక్షులు జమాలయ్య, జిల్లా ఇన్‌ఛార్జి మత్స్యశాఖాధికారి ఏ. కిరణ్ కుమార్ హాజరై హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాల సంక్షేమం, ఆర్ధిక అభివద్ధి కోసం ప్రత్యేక దష్టి సారించిందన్నారు. మన జిల్లాలో సుమారు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 156 మైనర్ ఇరిగేషన్ చెరువులను, 6 రిజ ర్వాయర్లను, జిల్లాలోని 30 మత్స్య సహకార సంఘాల వారికి తక్కువ ధరలకె లీజుకు కేటాయిస్తున్నారని చెప్పారు. జిల్లాలో 3 పెద్ద జలా శయాల్లో మత్స్యకారులకు వేట చేసుకోవడానికి స్వల్ప రుసుంపై లైసె న్సుల జారీ చేశారన్నారు. కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు, ఫిషరీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
బహిష్కరించిన మత్సకారుల సంఘం నాయకులు
కడప అర్బన్ : నాలుగేళ్లుగా ప్రభుత్వం ఊకడంపుడు ఉపన్యాసాలు మినహా మత్స్యకారుల సంక్షేమానికి చేసిన కషి శూన్యం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సారధ్యంలోనే మత్స్యకారులకు అండదండగా నిలవడమే కాక అభివద్ధిలో పెద్దపీట వేశారని టిడిపి బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్ పేర్కొన్నారు. వేడుకలను తూతు మంత్రంగా నిర్వహించడంతో తాము సమావేశాన్ని బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. చెప్పిన సమయానికి కన్నా రెండు గంటల పాటు ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించడమే కాక సంక్షేమంపై వివరాలు చెప్పకుండా ముఖ్యమంత్రి జగన్ ఉపన్యాసానికే ప్రాధాన్యం ఇవ్వడం దురదష ్టకరమన్నారు. టిడిపి ప్రభుత్వంలో మత్స్యకారుల దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని పేర్కొన్నారు. బహిష్కరించిన వారిలో మత్స్య సహకార సంఘం నాయకులు బోలా సుబ్బరాయుడు, మల్లె సుబ్బయ్య, మానా చంద్రశేఖర్, ఆవుల వెంకటేష్, వర్డి బోయిన రాము, జింకా సుక్రివ ఉన్నారు.