కొమరగిరిపట్నం ఉపసర్పంచ్‌గా వెంకటరెడ్డినాయుడు
అమలాపురం(అల్లవరం) కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా గుర్రం వెంకటరెడ్డి నాయుడు(శ్రీను) గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ రాపాక విజయలక్ష్మి అధ్యక్షతన ఆలమూరు పిఒఆర్డి, ప్రత్యేక అధికారి పిఆర్సి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశములో పంచాయతీ పాలకవర్గ సభ్యులు గుర్రం వెంకటరెడ్డి నాయుడు ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంలో జరిగిన జెంటిల్మెన్ ఒప్పందంలో భాగంగా ఈ ఉపసర్పంచ్ఎన్నిక అనివార్యమైంది. వెంకటరెడ్డి నాయుడుకు లక్ష్మణేశ్వర పిఎసిఎస్ అధ్యక్షులు అల్లూరి సురేష్ రాజు, ఎంపిటిసి సభ్యుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు కడలి లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొంతు సత్యనారాయణ, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఛైర్మన్ నామన బాల భాస్కర రావు అభినందనలు తెలిపారు.
చెముడులంక, చొప్పెళ్ల
ఉపసర్పంచులుగా చంటి, దుర్గారావు
ఆలమూరు చెముడులంక, చొప్పెల్ల గ్రామాలకు సంబంధించి ముందుగా చేసుకొన్న పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లుఆ గ్రామ ఉపసర్పం చులుగా పదవి బాధ్యతలు నిర్వహించిన అడబాల వెంకటరావు, సుంకర కామరాజులు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆ పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో మిగిలిన రెండున్నరేళ్లు ఉప సర్పంచులుగా బాధ్యతలు నిర్వహించేందుకు చెముడులంక గ్రామ వార్డు సభ్యుడైన దొండపాటి చంటి, చొప్పెల్ల వార్డు సభ్యుడైన తోరాటి దుర్గారావులు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా పంచాయతీ కార్యాలయాల్లో వారిచేత ఎన్నికల అధికారులైన ఏఎస్ గౌరీ కుమారి, అడబాల శ్రీనివాసరావులు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ సర్పంచులు తమ్మన శ్రీనివాసు, దంగేటి చంద్రకళ బాపనయ్య, ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జెడ్పిటిసి సభ్యురాలు తోరాటి సీతా మహాలక్ష్మి తదితరులు ఉప సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు.