ఈనెల 14 నుంచి 20 నిర్వహించిన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఈ వారం రోజులు జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాల్లో విద్యార్థులకు నిర్వహించి వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
పాలకొండ: గ్రంథాలయాలు నిలయాలు ఉన్న చోటే..విజ్ఞాన వంతులు పెరిగి అభివద్ధికి తోడ్పాడుతుందని శాసన మండలి విప్ పాలవలస విక్రాంత్ అన్నారు. సోమవారం గ్రంథాలయాలు వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని స్థానిక గ్రంథాలయాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా శాసన మండలి విప్ హాజరై మాట్లాడారు.కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి బి.గణేష్ బాబు, ఎంపీపీ బి.బాను, కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, టి.శంకరరావు, ఉపాద్యాయులు బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ పోటీలు విజేతులగా నిలిచిన విద్యార్థులు బహుమతులు అందించారు.
పార్వతీపురంరూరల్ : రాష్ట్ర గ్రంధాలయ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు పఠనం పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ కర్త డాక్టర్ డి.పారినాయుడు, రాష్ట్ర గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షులు టి.శివకేశవరావు మాట్లాడారు. విద్యార్థులకు పద్య పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటనాయుడు, ఉపాధ్యాయులు బాలకృష్ణ, పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్ : పట్టణంలో గల శాఖా గ్రంథాలయంలో జరిగిన ముగింపు వారోత్సవాలను మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల చిత్రలేఖనం విజయం సాధించిన విద్యార్థినిలకు బహుమతులు ప్రధానం చేసారు. కార్యక్రమంలో ప్రముఖ బాల సాహిత్యవేత్త బి.ఉమామహేశ్వరరావు మరియు రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ మిన్నారావు, పాఠకులు గ్రంథాలయాధికారి ఎ.ధర్మారావు పాల్గొన్నారు.
వీరఘట్టం: స్థానిక శాఖ గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు సోమవారం బహుమతులు ప్రధానం చేసినట్లు గ్రంథాలయ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. విజేతలకు కోడి రామ్మూర్తి నాయుడు మనవడు కోడి వెంకటరమణ నాయుడు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి ఉరిటి రామారావు హాజరయ్యారు. ఇఒపిఆర్‌డి గోపాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఇఒ కొండలరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఇ.వెంకటరత్నం, సాయి నికేతన్ హైస్కూల్ ఉపాధ్యాయులు సదాశివరావు, జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినిలు, శాఖ గ్రంథాలయ నిర్వహకులు నల్ల మధుసూదన్‌రావు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంపిపి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందర్నీ అలరించింది.
పాచిపెంట: స్థానిక శాఖ గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, కొత్తవలస జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణాజీ, శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయులు సూర్యనారాయణ, సమత పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు సంతోసి కుమారి, రిటైడ్ టీచర్ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో జరిగిన వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్, డిబేట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె.ఉదరు భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.
సీతంపేట : 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఐటిడిఎ డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి ముఖఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమములో గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు, సహాయకుడు రామకృష్ణ పాల్గొన్నారు.
సీతానగరం : స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ముంగిపు కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు జి పైడిరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పెదబోగిలి సర్పంచ్ జె.తేరేజమ్మ, గరికయ్య, వార్డు సభ్యులు పెద్దింటి రామారావు, టి.రామారావు, ఉపాధ్యాయులు, గ్రంథాలయాధికారి జి.వెంకట్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భామిని: స్థానిక శాఖా గ్రంథాలయంలో లైబ్రయిన కె.సునీత ఆధ్వర్యంలో ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహశీల్దార్ నీలాపు అప్పారావు విచ్చేశారు. ఈ సందర్బంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి బిడ్డికి విష్ణు, ఉపాధ్యాయులు సునంద, శాంతి, శ్రీదేవి, సుజాత, జగదీశ్ పాల్గొన్నారు.