Nov 17,2023 12:39
  • ప్రశ్నార్ధకమవుతున్న  మహిళా సాధికారత?

ప్రజాశక్తి-రామచంద్రపురం : మహిళలు వెనకబాటు తనం నుండి బయటకు రావాలని వారికి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వాలని  భారత రాజ్యాంగం 73వ సవరణ ద్వారా మహిళలకు సాధికారత కల్పించారు. 1970లో అమల్లోకి వచ్చిన మహిళా సాధికారత బిల్లు ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. మహిళా సాధికారత అంటే మహిళల శక్తి యుక్తులను బలోపేతం చేయడం సామర్థ్యాలను మెరుగుపరచడం, సమర్థులుగా తయారు చేయడం, ఈ మేరకు వారందరికీ స్థానిక సంస్థల్లోనూ శాసనసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించి వారికి పరిపాలన పరమైన లక్షణాలతోపాటు నాయకత్వం వహించే అవకాశం కల్పించారు. అయితే మహిళా ప్రతినిధులు రిజర్వేషన్లు ప్రకారం ఎంపికైనప్పటికీ వారి పదవులను సైతం మగమహారాజులు అనుభవిస్తున్నారు. పంచాయతీల్లోనూ మండల పరిషత్ సమావేశాల్లోనూ సర్పంచులు ఎంపీటీసీల భర్తలు పెత్తనం చెలాయిస్తూ మహిళలకు నాయకత్వ లక్షణాలు పరిపాలనపరమైన అవకాశాలు లేకుండా చేస్తున్నారు. రామచంద్రపురం మండలంలో 20 ఎంపీటీసీలుగాను 12 మంది మహిళలు గెలుపొంది సత్తా చాటారు. కేవలం ఎనిమిది మంది పురుషులే ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. అదేవిధంగా 25 మంది సర్పంచులకు గాను 12 మంది పురుషుల సర్పంచులు కాగా, 13 మంది మహిళా సర్పంచులు ఉన్నారు. ఆయా పంచాయితీలు వద్ద మండల పరిషత్ సమావేశాలకు భార్యలకు బదులు భర్తలు హాజరవుతూ పెత్తనం చేలా ఇస్తున్నారు. దీంతో రాజ్యాంగం మహిళలు కల్పించిన మహిళా సాధికారత ప్రశ్నార్ధకంగా తయారయింది. మహిళలు రాజకీయ రంగాల్లో తమ కార్యక్రమాలు నిర్వ హించెందుకు పలు నిబంధనలను రాజ్యాంగం కల్పించింది. నిబంధన 14 ఒకటి, వివక్ష నిర్మూలించేందుకు నిబంధన15, సమాన అవకాశాలకు నిబంధన 16, గౌరవానికి భంగం కలగకుండా నిబంధన  51 ఏ. వంటి పలు రక్షణ చట్టాలను మహిళలకు ఏర్పాటు చేసింది. అయితే గ్రామపంచాయతీలు కార్యాలయాల వద్ద మండల పరిషత్తు సమావేశాలకు సర్పంచులు ఎంపీటీసీల భర్తలు హాజరవుతూ వారు పెత్తనం చేయడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజ్యాంగం మహిళలకు కల్పించిన మహిళా సాధికారత సక్రమంగా అమలు చేయాలని మహిళలు రాజకీయ రంగాల్లోనూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భర్తల పెత్తనం తగ్గించాలని మండల సమావేశాలు భార్యల బదులు భర్తలు హాజరు కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.