Nov 14,2023 21:33

నంద్యాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పిస్తున్న ఎంఇఒ, కౌన్సిలర్‌ తదితరులు

నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు
- ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - విలేకరులు

      నంద్యాల జిల్లా వ్యాప్తంగా 56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు మంగళవారం ఆయా గ్రంధాలయాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అలాగే దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవం వేడుకలను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించుకున్నారు.
నంద్యాల : నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని నంద్యాల ఎంఇఒ పి.శివరాం ప్రసాద్‌ తెలిపారు. 56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలల దినోత్సవం, దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రు జయంతి కార్యక్రమాలను మంగళవారం నంద్యాల పట్టనంలోని పింగళి సూరన స్మారక శాఖా గ్రంధాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఇఒ పి.శివరాం ప్రసాద్‌, 13వ వార్డు కౌన్సిలర్‌ సరస్వతి, మిడ్‌ టౌన్‌ రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షులు కాల్వ నాగరాజు, రిటైర్డ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఎల్‌.ఎన్‌. నీలకంఠమాచారిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఇఒ తలపై తెల్లటి టోపీ, చాతిపై ఎర్రటి గులాబీ, పెదవులపై చిరునవ్వు గల నెహ్రూ నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని పిలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్‌ గ్రంథాలయాధికారి అర్‌ఇ.శ్రీధర్‌, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక కేఎన్‌ఎం పురపాలక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి, పురపాలక పాఠశాల స్థల దాత కాదర్‌ బాద్‌ నరసింగరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లయన్స్‌ క్లబ్‌ యువ సభ్యుల సౌజన్యంతో రూ. 10 వేలు విలువ చేసే క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. పాఠశాల హెచ్‌ఎం అసదుల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రవి కృష్ణ, సీనియర్‌ లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. బనగానపల్లె : నేటి బాలలే రేపటి భారత భావి పౌరులని ప్రియదర్శిని ఇంగ్లీష్‌ మీడియం కరస్పాండెంట్‌ సబేరా పేర్కొన్నారు. పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను కరస్పాండెంట్‌ ప్రారంభించారు. ఎపి పబ్లిక్‌ లైబ్రరీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిచేశారు. గ్రంథాలయ అధికారి బషీర్‌ అహ్మద్‌, బీడీసీ ఆర్గనైజర్లు యాగంటిపల్లె భాస్కర్‌ రెడ్డి, విఠలాపురం శివరామిరెడ్డి, కైప మాధవి, మంగంపేట శ్రీనివాసులు, నందవరం రామాంజనేయులు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాలలోని నడిగడ్డలోని మాస్టర్‌ పబ్లిక్‌ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను కరస్పాండెంట్‌ హలీమా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య తిధులుగా సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్స్‌ వైద్యులు డాక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి (జనరల్‌ మెడిసిన్‌), క్రాంతి కిరణ్‌ (ఆర్థోపెడిక్‌)లు హాజరై నెహ్రూ చిత్ర పటానికి నివాళులర్పించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు, వేష ధారణలు అలరించాయి. ఇటీవల జరిగిన పరీక్షలలో, క్రీడలలో ప్రతిభ చూపిన వారికి ముఖ్య అతిధులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్‌ దస్తగిరి పర్ల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అవుకు : అవుకు పట్టణంలోని మదర్‌ మోడల్‌ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్‌ ముచ్చలపురి శ్రీనివాసులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హెచ్‌ఎం మురళీమోహన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి అరుణ కుమారి ఆధ్వర్యంలో గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల డివిజన్‌ ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్‌ అధ్యక్షులు అమిర్‌ భాష, గ్రంథాలయ అధికారి అరుణకుమారి, న్యాయవాది షహినా బేగంలు పాల్గొని గ్రంథాలయ వారోత్సవాల ప్రాముఖ్యతతో పాటు బాలల దినోత్సవాన్ని వివరించారు. కెవి సుబ్బారెడ్డి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు : పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి హైస్కూల్‌లో హెచ్‌ఎం ఓబన్న ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అపుస్మ నంద్యాల డివిజన్‌ అధ్యక్షుడు అమీర్‌ భాష హాజరయ్యారు. ఉపాధ్యాయులు విజరు కుమార్‌ ఆచారి, రాజ్యలక్ష్మి, రాజ్‌, ఓబులపతి, విద్యార్థులతో కలిసి ఓబన్న, అమీర్‌ భాషలు నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. రుద్రవరం : రుద్రవరంలోని సరస్వతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల యాుజమాన్యం, ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే మండలంలోని ఆలమూరు గ్రామంలోని తిప్పపై ఉన్న ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి సేవా సమితి అధ్యక్షులు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. జనసేన మండల కన్వీనర్‌ అంజి, సుంకన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రుద్రవరంలోని గ్రంధాలయం కార్యాలయంలో గ్రంధాలయ వారోత్సవాలను అధికారి శౌరెడ్డి ప్రారంభించారు. అలాగే ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, గేమ్స్‌, మ్యూజికల్‌ షేర్స్‌, పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాణ్యం : పాణ్యం శాఖ గ్రంథాలయంలో గ్రంధాలయాధికారిణి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ హుస్సేన్‌ బి నెహ్రూ చిత్ర పటానికి పూలమాలంకరణ చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎంఇఒ కోటయ్య పాల్గొని మాట్లాడారు. సర్పంచి పల్లవి, వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కమలాకర్‌, ఉప మండలాధ్యక్షురాలు పార్వతమ్మ, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.