Nov 13,2023 22:35

ప్రజాశక్తి-గుడివాడ : పాలస్తీన మీద ఇజ్రాయిల్‌ దాడులను ఖండించాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఆర్‌ సి పి రెడ్డి అన్నారు. అమెరికన్‌ సామ్రాజ్యం యుద్ధం మత చర్యలను ఖండిస్తూ గుడివాడ పట్టణం నెహ్రూ చౌక్‌ లో సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ సి పి రెడ్డి మాట్లాడుతూ పాలస్తీన మీద ఇజ్రాయిల్‌ యుద్ధానికి మద్దతు ఇస్తున్న అమెరికా ఎప్పటినుంచో ఇజ్రాయిల్‌ పాలస్తీన పౌరులపై దాడులు చేయటం జరుగుతుందన్నారు. యుద్ధ నిబంధనలు కూడా ఉల్లంఘించడం పసిపిల్లలతో పాటు ఆసుపత్రుల మీద దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆ దేశాల మీద పట్టు సాధించడానికి ఇజ్రాయిలు కి యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తూ ఆర్థిక సాయం చేస్తున్న అమెరికా దేశం ప్రపంచంలోనే ఈ యుద్ధమాతాన్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే నేడు పాలస్తీన ఎప్పటినుంచో స్వతంత్ర దేశంగా గుర్తించమని తమకి రాజధాని ఏర్పాటు చేయమని ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి అని అరబ్‌ దేశాలు కూడా మొత్తుకుంటున్నా ఇజ్రాయిల్‌ కి అమెరికా సపోర్టు ఇచ్చి తన ఆయుధ సంపదని ఇజ్రాయిల్‌ కి సప్లై చేసి యుద్ధానికి కారణం అయ్యిందన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ యుద్ధ తంత్రాన్ని, యుద్ధంలో నిబంధనలు కూడా పాటించకుండా అమెరికా చేసే చర్యలను తాము ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులుతమ్మిశెట్టి లక్ష్మణరావు, పి రజిని, సిహెచ్‌ శివ, కార్పెంటర్స్‌ నాయకులు భాష, తాజుద్దిన్‌, రమణ, రెడ్డి నాగరాజు, ఎలీషారావు, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.