పడవలొదిలి నిరసన
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ- జనసేన పార్టీలు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. ఆ పార్టీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పిలుపు మేరకు శనివారం పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, దక్షిణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామాల్లో పర్యటించి డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. వర్షపు నీరు నిల్వ చేరిన గుంతల్లో పడవలు వదిలి జగనన్న ఇదేనా నీ అభివద్ధి అంటూ ఎద్దేవా చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో 'గుంతల రాజ్యం ఏపీ', 'వ ఏపీ హేట్స్ జగన్' పేరిట హాష్ టాగ్‌లతో నిరసన తెలియజేశారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కోట వినుత, టీడీపీ తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.