ప్రజాశక్తి - రాజమహేంద్రవరం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి నిర్ధారణ చేయాల్సిన ఓటర్ల జాబితాకు సంబంధించి ఉన్న పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీన గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిం చారు. ఈ కాన్ఫెరెన్స్‌లో కలెక్టర్ మాధవీలత పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక సారాంశ సవరణ అనుగుణం గా ఎప్పటికప్పుడు పెండింగ్ దరఖాస్తులను పరిశీ లించి పరిష్కారం చేయడం జరుగుతోందన్నారు. వివిధ రాజకీయ పార్టీల ద్వారా వచ్చిన 7061 అభ్యం తరాలను పరిష్కరించినట్లు చెప్పారు. డూప్లికేట్ ఓట్లు 572, చిరునామా మార్పు కి చెందిన 716, మరణిం చిన ఓటర్లు 5,773 మందికి చెందిన అభ్యంతరాలు నూరు శాతం హాజరై పరిష్కారం చేశామన్నారు. అదే క్రమంలో ఓటర్ల జాబితాపై క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దరఖాస్తుకు డిసెంబర్ 9 వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. వాటిని డిసెంబర్ 26లోగా పరిష్కారం చేసేందుకు అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. ఒకే చిరునామా కింద పదికి మించి ఉన్న ఓటర్లు ఉన్న 1196 గృహాల్లో 14,791 మంది ఉన్నట్లు గుర్తించామని, వాటిలో 10,985 ఓటర్లు సరైనవిగా, 3761 ఓటర్ల ఇంటి చిరునామా మార్పు చెందిన ఫారం 8 స్వీకరించినట్లు తెలిపారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.