కురుపాం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావును విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిశీల కులుగా టిడిపి అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించిందని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పరిశీలకులుగా ఆ నియోజకవర్గం, పార్టీ పరిస్థితులు తెలుసుకొని పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కురుపాం నియోజ కవర్గ టిడిపి అశావాసులు పువ్వుల లావణ్య, బిడ్డిక పద్మావతి, బిడ్డిక తమ్మయ్య, చందక రామకృష్ణ, నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులు అభినందనలు తెలిపారు.