Nov 16,2023 22:07

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల టిడిపి ఆధ్వర్యంలో గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వివరాలు ఇవి.
అంబాజీపేట పసుపల్లిలో గురువారం టిడిపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహించారు. సీనియర్‌ టిడిపి నాయకులు వక్కలంక బుల్లియ్య పాల్గొని ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తు గ్యారెంటీ పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో చంద్రబాబుదే గెలుపని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు చిన్నం బాలవిజయరావు, రాష్ట్ర ఎంబిసి సభ్యులు యడ్లపల్లి తుక్కియ్య, గ్రామ అద్యక్ష కార్యదర్శులు పెట్టా కష్ణ, నాగరాజు బూత్‌ కన్వీనర్లు పి.వెంకటేశ్వరరావు, కె. దుర్గారావు, ఎం.శ్రీను, పి.కిషోర్‌, సాయి తదితరులు పాల్గొ న్నారు.కపిలేశ్వరపురం గ్రామంలో గురువారం గ్రామ టిడిపి అధ్యక్షుడు నామాల బొజ్జియ్య అధ్యక్షతన జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఆలమూరు . మండలంలోని చెముడులంకలో 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ', రచ్చబండ కార్యక్రమాలు గురువారం రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమలాపురం అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడితిప్పలో అమలాపురం నియోజక వర్గ టిడిపి ఇంచార్జ్‌ అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యం లో 'బాబు ష్యూరిటీ భవిష్యత్‌ కు గ్యారంటీ''కార్యక్రమం రచ్చబండ సమావేశం జరిగినది. కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు దెంతులూరి సత్తిబాబురాజు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ కడలి వెంకటేశ్వ రరావు, యూనిట్‌ ఇంచార్జ్‌ నడింపల్లి సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.