ప్రజాశక్తి-అనంతగిరి:ఏజెన్సీలోని అరకు, అనంతగిరిలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు వేలాదిమంది పర్యాటకులతో పోటెత్తాయి.వరుసగా రోజులు సెలవు దినాలు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు అనంతగిరి. బొర్రా గుహలు. కటికి. .తాడిగుడ జలపాతాలతో పాటు అనంతగిరి అటవీ ఘాట్ రోడ్డు మలుపులను సందర్శించారు. డమ్ముకు, సుంకరమెట్ట, యు పాయింట్, అనంతగిరి కాఫి ప్లాంటేషన్ తదితర ఆహ్లాదకరమైన ప్రదేశాలను తిలకిస్తూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడపారు.బొర్రా గుహలు తిలగించిన పర్యాటకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గుహలు ఏ విధంగా ఏర్పడింది తదితర వివరాలను గాడ్స్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డమ్ముకు, కాఫీ ప్లాంటేషన్లు జనాలతో కీటకిటలా డడంతో ట్రాఫిక్ అంతరాయంలో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులకు గురయ్యారు.