ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో ఎల్‌ఐసి మహిళా ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం జోనల్ నాయకురాలు ఎస్‌కె.గీత పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక మోడల్ కాలనీలో గల ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం భవనంలో 11వ మహిళ సదస్సు జరి గింది. ఈ సదస్సుకు ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ఉభయ జిల్లాల అధ్యక్షుడు గుబ్బల.రాంబాబు అధ్య క్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ అసంఘటిత రంగంలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ప్రజా ఉద్యమాల బలోపేతానికి, మహిళా ఉద్యోగులు చురు కుగా పాల్గొనాలని కోరారు. సమాజ అవసరాలు తీర్చ డం కోసం మహిళ ఉద్యోగులూ కృషి చేయాలని సూచించారు. ఎల్‌ఐసి మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకురాలు జి.సూర్యప్రభ మాట్లాడుతూ మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయరంగంలో ముందుకు రావాలన్నారు. ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు సతీష్ ప్రయాగ మాట్లాడుతూ సంఘ టితంగా ఉంటేనే హక్కులను కాపాడుకుంటామ న్నారు. డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండ రామ్ మహిళా ఉద్యోగులు చేస్తున్న సేవలను, పోరా టాలను అభినందించారు. మహిళా ఉద్యోగుల కన్వీనర్ ఆర్.శిరీష ప్రవేశపెట్టిన వార్షిక నివేదికను సభ ఆమోదించింది. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు కెఎస్.శ్రీదేవీ, పి.విజయదుర్గ, గాయత్రి, కవిత, సుధారాణీ, ప్రసన్న కుమారి, సంఘ నాయకులు గన్నెయ్య, విశ్వనాథ్, సుధాకర్, సుబ్బారావు, శ్రీనివాస్, ఈశ్వర్రావు, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.