పట్టుదలతో కషి చేస్తే ఏదైనా సాధించొచ్చు ఫ్రెషర్స్‌డే వేడుకల్లో సిద్ధార్థ కళాశాలల ఛైర్మన్ అశోక్‌రాజు
పట్టుదలతో కషి చేస్తే ఏదైనా సాధించొచ్చు
ఫ్రెషర్స్‌డే వేడుకల్లో సిద్ధార్థ
కళాశాలల ఛైర్మన్ అశోక్‌రాజు
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టుదలతో కషిచేస్తే ఏదైనా సాధించొచ్చని సిద్ధార్థ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు పేర్కొన్నారు. పుత్తూరు లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా కళాశాలల ఛైర్మన్ అశోకరాజు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫ్రెషర్స్‌డే వేడుకలు ప్రార్థనా గీతంతో ప్రారంభిం చారు. ఈ సందర్భంగా అశోకరాజు మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాలలను ఎంచుకొన్నందుకు విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు. డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంసిఏ ఎందులో చేరినా ఫ్రెషరీ విద్యార్థులు సంకల్ప బలంతో, పట్టుదలతో కషి చేస్తే ఏదైనా సాధించ వచ్చునని తెలిపారు. సీనియర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ రోల్ మోడల్‌గా దశా దిశ నిర్దేశించే విధంగా వారికి గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపించాలని కోరారు. కళాశాల డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు మాట్లా డుతూ జూనియర్, సీనియర్ విద్యార్థులు డెడికేషన్, కమిట్‌మెంట్, డిసిప్షన్ అంశాలపై దృష్టి సారిస్తే విజయాన్ని అందుకుంటారని తెలిపారు. దీన్ని క్రమశిక్షణగా తప్పకుండా పాటిస్తే అనుకున్న ధ్యేయాన్ని త్వరగా చేరుంటారని, అందరికి ఫ్రెషర్స్‌డే శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం జూనియర్ అధ్యా పకులు మాట్లాడుతూ కళాశాలకు వచ్చిన మొదటిరోజే తడబడతామని తర్వాత సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులు మాపై చూపించిన అభిమానం, సోదర భావంతో నేడు అందరి ముందు మాట్లాడ గలుగు తున్నామని మరెంతో సాధిస్తామని నమ్మకం వచ్చింద న్నారు. అనంతరం విద్యార్థులు పాటలతో డ్యాన్స్‌తో సాంస్కతిక కార్యక్రమాలు అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ జనార్ధన్ రాజు, చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ సూర్య రాజు పాల్గొన్నారు.