Nov 19,2023 22:31

ప్రజాశక్తి - రేపల్లె
రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి డాక్టర్‌ మెరుగు నాగార్జున అన్నారు. రక్త దాన కార్యక్రమాల ద్వారా రెడ్ క్రాస్  ఆపన్నులకు ప్రాణదానం చేస్తున్నదని అన్నారు. రెడ్ క్రాస్ జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సంస్థని తెలిపారు. రెడ్ క్రాస్ సేవలు మారుమూల ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయని అన్నారు. రెడ్ క్రాస్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చెయాలని కోరారు. సంస్ధ అనుసరిస్తున్న ఆదర్శ ప్రాయమైన మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తి చేయాలని అన్నారు. అప్పుడే ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సేవలను అందుకో గలుగుతారని అన్నారు. రెడ్ క్రాస్ సమాజసేవ చేసే విషయంలో తాను పూర్తిగా చేదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. తీర ప్రాంతంలో మంచి పనితీరు కనబరిచిన రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ వసంతం వీర రాఘవయ్యను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కట్టా మంగ, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ వసంతం వీర రాఘవయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, విశ్వనాథ గుప్త పాల్గొన్నారు.