రోడ్లపై ప్లాస్టిక్ కనిపిస్తే జరిమానా : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ సమీర్ శర్మ
- రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ సమీర్ శర్మ
ప్రజాశక్తి- తిరుపతి టౌన్ : ప్లాస్టిక్ ఉత్పత్తి పరిశ్రమలు తమ వస్తువులను వినియోగాదరుల వాడకం అనంతరం రీసైకిల్ కోసం తిరిగి సేకరణ బాధ్యత తీసుకోవాలని, రోడ్లపై, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్, బాటిల్స్ కనపడరాదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ సమీర్ శర్మ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక శ్రీపద్మావతి అతిధి గృహంలో చైర్మన్ పిసిబి, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో పాల్గొని పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ మాట్లాడుతూ రహదారుల్లో, రహదారుల పక్కన ప్లాస్టిక్ సంబంధిత బ్యాగ్‌లు, వస్తువులు, ప్రధానంగా బాటిల్స్ కనబడరాదని, నిర్లక్ష్యం వహిస్తే భారీ అపరాద రుసుములు సంబంధిత పరిశ్రమలే చెల్లించాలని, మునిసిపల్, పంచాయితీ అధికారులు దృష్టిపెట్టాలని అన్నారు. పరిశ్రమలు తమ ఉత్పత్తులను వినియోగం అనతరం రీ సైకిల్ విధానానికి సేకరించాల్సిన పూర్తి బాధ్యత ఉందని, ఈపీఆర్ అమలు చేయాలని చట్టం చెబుతున్నదని లేదంటే అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు 165, ప్రైవేట్ ఆసుపత్రులు 834, పశువైద్యశాలలు 36 మొత్తం 1035కు పైగా వున్నాయని అన్నారు. బయోమెడికల్ వేస్ట్ రూల్స్ - 2016 తప్పనిసరి అమలు కావాలని, జిల్లాలో అనుమతి పొందిన బయో వెస్ట్ రీసైకిల్ కంపెనీ దారులు తప్పనిసరి సేకరణ సమయంలో క్యూఆర్ కోడ్, బ్లూటూత్ విధానంతోనే ఎంత బరువు వాడిన బయోవేస్ట్ తీసుకేలుతున్నది యాప్‌లో రోజువారి నమోదు జరగాలని సూచించారు.
తిరుపతి నగరపాలక వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టం బాగుందని, ప్రెసిడెన్సియల్ అవార్డు అందుకోవడం అభినదనీయమని, పోల్యుషన్ హాట్ స్పాట్లలో, ఈ మధ్య ఏర్పాటు చేసిన ఫ్రీలెఫ్ట్‌ల వద్ద ఎఇకమ్ సంస్థ ప్రతిపాదనలు తీసుకుని పచ్చదనం పెంచాలన్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీ, జమాటో వంటి సంస్థలు సరఫరా చేసే ప్లాస్టిక్ వస్తువులు, పాల పంపిణీదారులు వారు సరఫారా చేసే పాల ప్యాకేట్స్ వెస్ట్ సంబంధిత వారే సేకరణ చేపట్టడానికి చర్యలు చేపట్టి అమలు చేయాలని ఈపిఆర్ అన్నది చట్టం చెబుతున్నదని అన్నారు. ప్రధానంగా సానిటరీ ఇన్స్‌పెక్టర్ ఎఎ బ్రాండ్ ప్లాస్టిక్, బాటిల్స్ వంటివి ఉంటాయో తెలుస్తుందని ప్రణాళికాబద్ధంగా సూచనలు ఇవ్వడం, సేకరణపై దష్టి పెట్టాలన్నారు. మల్టీ నేషన్ కంపినీలు కోక్, ధమ్సప్ వంటి వినియోగం వివరాలు, రీ సైకిలింగ్‌కు సేకరించిన వివరాలు ఉండాలని, రీ సైక్లింగ్ స్థానిక సంస్థలకు ఇవ్వగలిగితే త్వరగా ప్రాసెస్ తెలుస్తుందని అన్నారు. వాహనాలకు సంబంధించి బైబ్యాక్ విధానంతో బ్యాటరీలు సేకరణ, ఆ- వేస్ట్ ఎలక్ట్రానిక్ సంస్థల వస్తువులు విడిభాగాలు మార్చే లెక్కలు, వాటి సేకరణ, రీసైక్లింగ్ వివరాలు వుండాలని సూచించారు. స్పందనలో కాలుష్యంపై అందిన అర్జీలు సకాలంలో పరిష్కారం కావాలన్నారు. ఇక శబ్ద కాలుష్యం, వాహన కాలుష్యం విషయంలో పోలీస్, పిసిబి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వాహనదారులకు జరిమానాలు విధించాలని సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థలో అమలవుతున్న వేస్ట్ మేమేజ్‌మెంట్ విధానంపై నగరపాలక డిసి చంద్రమౌలీశ్వర రెడ్డి వివరించారు. ఈసమీక్షలో పిసిబి కర్నూల్ జాయింట్ కమిషనర్ రమేష్, పిసిబి ఈఈ నరేంద్ర, ప్రధాన ఆసుపత్రుల ప్రతినిధులు, ప్లాస్టిక్ ఉత్పత్తి దారులు, ప్లాసిట్‌తో ముడిపడివున్న డ్రింక్స్ సంస్థల, అనుమతి పొందివున్న రీసైకిల్ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.