ప్రజాశక్తి-దర్శి: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారని, అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని చందలూరు, రాజంపల్లి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం జరిగింది. ఆయా సర్పంచ్‌లు మారెళ్ల రమణ, ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. మన పరిపాలన చూసి ఇతర రాష్ట్రాలు కూడా దీనినే ఆచరిస్తున్నాయన్నారు. రాజంపల్లిలో వై ఎపి నీడ్ జగన్ కరపత్రాలను ఆవిష్కరించారు. సర్పంచి వనం అన్నపూర్ణ విజరు పాల్గొన్నారు. దర్శి రామాలయం వద్ద మెప్మా సిఎంఒ కల్పన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అర్బన్ మార్కెట్‌ను ప్రారంభించారు. అదే విధంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్‌ను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సావిత్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కుసుమకుమారి, డీటీ రవిశంకర్, మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ షకీల మిల్లర్ బుజ్జి, కన్వీనర్లు బి వెంకటేశ్వర్లు, నాయకులు గోళ్ల అచ్చయ్య, సర్పంచ్‌లు మారెళ్ల అరుణ, రాము, ఆయా గ్రామాల నాయకులు, లబ్ధిదారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.