Nov 17,2023 23:17

అంబాజీపేటలో ఉమ్మడి సమావేశంలో టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి - అంబాజీపేట
టిడిపి, జనసేన కలయిక చారిత్రాత్మక విజయమని వైసిపి దుష్టపాలన నుంచి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిస్తుందని టిడిపి పి.గన్నవరం నియోజకవర్గ టు మెన్‌ కన్వీనర్‌ నామన రాంబాబు అన్నారు. అంబాజీపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఎసి ఫంక్షన్‌ హాలు నందు శుక్రవారం టిడిపి జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ సమావేశం జరిగింది. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంటి హరీష్‌ మాథూర్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం దళిత సామాజిక వర్గానికి శాపంగా మారిందని దళితులు ఓట్లతో గద్దెనెక్కి దళితుల ప్రాణాలు తీస్తోందన్నారు. టిడిపి, జనసేన పార్టీలు ఒకే మాట - ఒకే బాటగా క్రమశిక్షణగా పార్టీ కార్యకర్తలు నడవాలని డొక్కానాథ్‌బాబు అన్నారు. అసత్య ప్రచారాలతో సత్య ప్రసారాలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నించే వైసిపి ప్రయత్నాలు తిప్పి కొట్టాలని ఉమ్మడి తూర్పుగోదావరి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో ముంచేసిన వైసిపి దుష్ట పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు యర్రా వేణుగోపాల రాయుడు, సీనియర్‌ నాయకులు వక్కలంక బుల్లియ్య, డివివి.సత్యనారాయణ, మొల్లేటి శ్రీనివాస్‌, డి.శ్రీనురాజు, చిట్టూరి శ్రీనివాస్‌, టి.సత్తిబాబు, బి.పెదబాబు, జివి.రాఘవులు, చిన్నం విజయారావు, రవణం రాము, ఎన్‌వి.సుబ్బారావు, కొమ్ముల కొండలరావు, పెదపూడి శ్రీను, గూడాల ఫణి, బోణం బాబు, వాసంశెట్టి కుమార్‌, దువ్వూరి సురేష్‌, అయ్యగారి సూరిబాబు, జాలెం శ్రీనివాసరావు, మద్దాల సుబ్బారావు, వాకపల్లి దొరబాబు, ఎన్‌.వీర్రాజు, ఎ.బలరామూర్తి, దొమ్మేటి శ్యామ్‌, నియోజకవర్గ టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.