Nov 17,2023 22:57

ప్రజాశక్తి-యంత్రాంగం
పలుచోట్ల టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టనున్న సూపర్‌ సిక్స్‌ పథకాల వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆలమూరు మండలంలోని చొప్పెల్లలో 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్నిటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్‌ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి పన్నుల భారం పెంచి ప్రజలకు కష్టాలే మిగిల్చినందుకా వైసిపి నాయకులు ఈ సామాజిక సాధికార యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మెర్ల గోపాల స్వామి, ఈదల సత్తిబాబు, సఖుమల్ల రాముడు, బళ్ల హరికష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం కూనవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం టిడిపి ఇన్‌ ఛార్జ్‌ ఆనందరావు, పార్టీ నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఆరిగెల నానాజీ, మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల రాము, నాయకులు సుందరనీడి సత్యమూర్తి, పండు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.మండపేట పట్టణ పరిధలోని 9వార్డులో శుక్రవారం జరిగిన 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన ఇంటింటికీ తిరిగి టిడిపి మ్యానిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు, వాటి ద్వారా ప్రతి కుటుంబానికి చేకూరే లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ చుండ్రు శ్రీ వరప్రకాష్‌, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి నాయకులు గుండు వీరతాత రాజు, వాకచర్ల గుప్తా, బండి గోవిందు, సిరంగు ఈశ్వరరావు, చుండ్రు సుబ్బారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.