ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సమగ్ర కుల గణన ప్రక్రియను సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కీలకమైన విధులను నిర్వర్తించాలని జెసి ఎన్.తేజ్ భరత్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ''కులగణన 2023'' సర్వే పై మాస్టర్ శిక్షకులకు అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లా డుతూ కుల గణనలో కుటుంబ సభ్యులు ప్రాథ మిక సమాచారంలో జిల్లా, మండలం, గ్రామం వివరాలు, గృహ ద్వితీయ వివరాల్లో కుటుంబ పెద్ద, ఇంటి చిరునామా, గృహ వివరాలు, ఎంతమంది తదితర అంశాలను, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుం దన్నారు. ఇంటింటి సర్వే ప్రక్రియలో సచివాలయ ఉద్యోగి - వాలంటీర్ కలిసే కుల గణన చేయా లని, ఖచ్చితంగా మార్గదర్శకాలు అనుసరించాలని తెలిపారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో 5 గ్రామాల పరిధిలో కులగణన ప్రస్తుతం నిర్వహిస్తున్నామని రాష్ట్ర, గ్రామ వార్డు సచివా లయ సాంకేతిక పరిపాలన అధికారి రత్న కిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఒ జి. నరసిం హులు, చీఫ్ ప్లానింగ్ అధికారి ఏ.ముఖ లింగం, కెకె ఆర్సి ఎస్డిటి.కృష్ణ నాయక్, ఎమ్. భాను ప్రకాష్, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, గణాంక అధికారులు, సచివాలయ సిబ్బందిపాల్గొన్నారు.