ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ : అత్యాధునికంగా నిర్మించిన పి.వి.ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్‌ను ఆదివారం మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తనదైన శైలిలో ఎందరికో విస్తృతమైన వైద్య సేవలు అందించిన డాక్టర్ పి.వెంకట్ రామ్ చౌదరి నేతత్వంలో నగరం లోని పటమట సోనోవిజన్ సమీపంలో ఈ హాస్పటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, వైద్య రంగానికి విజయవాడకు ఎనలేని సంబంధ ఉందని, అన్ని రకాల వైద్య సేవలను అందించడం నగరానికే గర్వకారణమని అన్నారు. యువకుడైన డాక్టర్ పి.వెంకట్ రామ్ చౌదరి నేతత్వంలో పేదలకు, గ్రామీణ ప్రాంతాలకు తమ వైద్య సేవలు మరింతగా విస్తరించాలని సూచించారు. డాక్టర్ పి.వెంకట్ రామ్ చౌదరిని అభినందించారు. డాక్టర్ పి.వెంకట్ రామ్ చౌదరి మాట్లాడుతూ విజయవాడ మహానగరం దినదినాభి వృద్ధి చెందుతున్న నేఫధ్యంలో ఆర్థో, జనరల్ మెడిసిన్ , గైనకాలజి, పల్మనాలజి, యూరాలజి వంటి చికిత్స లకు అత్యాధునిక వైద్య సేవలు లభించేలా ఈ హాస్పటల్ నిర్మించా మని తెలిపారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్, తదితరులు డాక్టర్ రామ్ చౌదరిని అభినందించారు.