ప్రజాశక్తి-రామచంద్రపురం
వచ్చే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించడమే టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం లక్ష్యం అని టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, జనసేన ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ లు పిలుపునిచ్చారు. ద్రాక్షారామలోని టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహిం చారు. సమావేశంలో రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ మంత్రి వేణు రామచంద్రపురం చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ శనివారం రోడ్లు వేయనందుకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తలు అంతా నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలోకడియాల రాఘవ న్, వాసంశెట్టి సూర్యనారాయణ, సలాది రమేష్, డేగల సతీష్, బంగారాజు, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి,జనసేన కలయిక చారిత్రాత్మక విజయం
అంబాజీపేట టిడిపి జనసేన కలయిక చారిత్రాత్మక విజయమని టిడిపి పి.గన్నవరం నియోజకవర్గ టు మెన్ కన్వీనర్ నామన రాంబాబు అన్నారు. అంబాజీపేటలో శుక్రవారం టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ సమావేశం జరిగింది.టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జ్ గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం దళిత సామాజిక వర్గానికి శాపంగా మారిందన్నారు. ఉమ్మడి, తూర్పుగోదావరి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు యర్రా వేణుగోపాల రాయుడు,సీనియర్ నాయకులు వక్కలంక బుల్లియ్య, డివివి సత్యనారాయణ,మొల్లేటి శ్రీనివాస్,డి.శ్రీనురాజు, చిట్టూరి శ్రీనివాస్, టి.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.