Nov 19,2023 21:04

సమావేశంలో మాట్లాడుతున్న విఆర్‌ఒల సంఘం నాయకులు

పార్వతీపురంరూరల్‌: జిల్లా వ్యాప్తంగా విఆర్‌ఒలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని విఆర్‌ఒల సంఘం జిల్లా అధ్యక్షులు మరడ సింహాచలం ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక తహశీల్దారు కార్యాలయ ఆవరణలో జరిగిన ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బెహరా మురళీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్‌ అసిస్టెంట్లను అప్‌గ్రేడ్‌ చేయాలని, గ్రేడ్‌-2 గ్రామరెవెన్యూ అధికారులను గ్రేడ్‌-1గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ 166 జివో అమలు చేయాలని కోరారు. సర్వే ట్రైనింగ్‌ విడతలవారీగా అందరి విఆర్‌ఒలకు నిర్వహించి ఫలితాలు వెంటనే ప్రకటించాలని, సర్వే శిక్షణను క్షేత్రస్థాయిలో నిర్వహించాలని కోరారు. విఆర్‌ఒలు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొం టున్న సమస్యలపై పోరాటానికి కార్యాచరణ నిర్ణయించేందుకు విస్తృత సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు బి.రాజా, ఉపాధ్యక్షులు కె.రామచంద్ర నాయుడు, డివిజన్‌ అధ్యక్షులు ఎస్‌ పురషోత్తంనాయుడు, కోట శ్రీనివాసరావు, బురిడి సింహాచలం పాల్గొన్నారు.