ప్రజాశక్తి - గోపాలపురం ఎస్‌సి వర్గీకరణ బిల్లును వచ్చే శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపె ట్టాలని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల సమన్వకర్త పేరుపోగు వెంకటేశ్వ రరావు మాదిగ డిమాండ్ చేశారు. గురువారం ఉప్పరగూడెంలో జగజ్జీవన్ రావ్ విగ్రహం వద్ద ఈనెల 30న జరిగే చలో విజయవాడ మహాసభ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధభేరి మహాసభకు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌సి సామాజికవర్గంలోని మాలలకే అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయని, దాని వల్లే మాదిగలు వెనుకబడ్డారని అన్నారు. రాబో యే ఎన్నికల్లో వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాదిగ ఉప కులాలకు 21 అసెంబ్లీ, 4 పార్లమెంట్లు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి కమిషన్ ఛైర్మన్ పదవిని కూడా మాదిగలకే కేటాయించాలని అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఇన్‌ఛార్జ్ గల్లా వెంకట శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి రాంబాబు, బొబ్బిలి వెంకటరాజు, కొడమంచిలి గంగరాజు, కొల్లి సురేష్ పాల్గొన్నారు.