Nov 05,2023 14:02

నెత్తుటి కరచాలనాలు
సరిహద్దులు దాటుతున్నాయి
మట్టిగా మొలకెత్తాల్సిన మనిషి
తుపాకీగా పుడుతున్నాడు
అంతరాల యుద్ధకూటములు
అవనిని కమ్మేస్తున్నాయి
అంతంలేని పోరాటం
ఆరంభించి శతాబ్దాలైంది
కనికరం లేని బుల్లెట్లవాన
పసిపిల్లలు
కురువృద్ధులు
మహిళలు
ఎవర్నీ కనికరించని
తారతమ్యం లేని ఘాతుకం
యుద్ధం నెత్తుటి ప్రళయం
శాంతిప్పుడు
విశ్వ నిఘంటువుల్లోంచి
విసిరేసిన పదం
మనిషి సృష్టించిన
సాంకేతిక సర్పం
రణరంగంలో
మనుషుల్నే కాటేస్తుంది
ఇక ఇప్పుడు
ఏడ్వడానికి పంచభూతాలు తప్ప
ఇంకెవ్వరూ లేరు..
- కెంగార మోహన్‌
94933 75447