Nov 17,2023 23:55

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-ఈపూరు : పల్నాడు జిల్లా యుటిఎఫ్‌ రెండవ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు వి.నాగేశ్వరావు కోరారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను మండలంలోని కొండ్రముట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నారపుశెట్టి చంద్రబాల జ్యోతిలక్ష్మితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలతోపాటు విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ నిరంతరం పోరాడుతోందన్నారు. సిపిఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణకూ అలుపెరగకుండా ఉద్యమిస్తోందని, ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీన గురజాలలోని చల్లగుండ్ల గార్డెన్స్‌లో జరిగే పల్నాడు జిల్లా కౌన్సిల్‌ సమావేశాలకు ఈపురు మండలం నుండి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. ఈ సమావేశాల్లో భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తారని, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు పిఎ జిలాని, జి.రామారావు, సిహెచ్‌ మల్లికార్జునరావు, ఎ.సుబ్బారావు, కె.రాంబాబు, జిజె.నాగరాజు, ఆర్‌. ఏడుకొండలు, బి.అశోక్‌ కుమార్‌, ఎం శ్రీనివాసు నాయక్‌, పి.రమేష్‌బాబు పాల్గొన్నారు.