ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : బానాది గ్రామములో గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .... వేపాడ మండలంలోని 18 గ్రామ సచివాలయాలకు నిధులు మంజూరు చేశారన్నారు. ఇప్పటికే ఐదు గ్రామ సచివాలయాలు నిర్మాణం జరిగి ప్రారంభోత్సవాలు కూడా చేశామన్నారు. వారం రోజుల్లో మరో ఆరు గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవానికి నిర్మాణం పనులు సాగుతున్నాయని తెలిపారు. ఎస్ కోట నియోజకవర్గంలోనే వేపాడ మండలంలో గ్రామ సచివాలయాలు పనులు సాగడానికి ప్రత్యేక శ్రద్ధ చూపి మంజూరు చేయించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనులు జరిగే విధంగా గ్రామ సచివాలయ భవనాలు పనిచేస్తున్నాయన్నారు.
వేపాడ మండల రహదారి నిర్మాణానికి శాసనసభ్యులు కడువండి శ్రీనివాసరావు నిధులను మంజూరు చేయించారు. వేపాడ మండలం ప్రధాన రహదారి అభివఅద్ధికి నోచుకోక ప్రజలు ప్రయాణానికి నరకయాతన అనుభవించేవారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దఅష్టిలో సమస్యను తీసుకుని వెళ్లి రోడ్డు విస్తరణ అభివృద్ధి కోసం రూ.39 కోట్లు నిధులు మంజూరు చేయించి శర వేగంగా పనులు జరిగే జరిగే విధంగా కఅషి చేశామన్నారు. ఫలితంగా ఈరోజు సోంపురం జంక్షన్ నుండి వేపాడు మీదుగా ఆనందపురం జనసేన వరకు 16 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు జరిగాయన్నారు. వేపాడ మండల ప్రజలు ఎమ్మెల్యే కి అభినందనలు తెలుపుతున్నారు.