ప్రజాశక్తి - శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను భానుని లేలేత కిరణాలు గురువారం స్పృశించాయి. ఐదు నిమిషాలపాటు సూర్య కిరణాలు ఆదిత్యుని పాదాలను తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు సందర్శకులు బారులుతీరారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో ఆదిత్యుని మూలవిరాట్‌ను సూర్యుడి కిరణాలు తాకుతుంటాయి. శుక్రవారం కూడా ఆదిత్యుని కిరణస్పర్శ ఉంటుందని, యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు.