Sep 19,2023 10:42

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : పల్లెల్లో గ్రామ పెద్దలు న్యాయ, న్యాయాలు తెలిపే స్థానం, న్యాయస్థానం లాంటి రచ్చబండను తిరిగి ఆ గ్రామస్థులు పున: నిర్మించారు. సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన రావి, వేప జంట చెట్ల కింద మండలంలోని తాడిపర్రులో ఏర్పాటుచేసిన రచ్చబండ ను మంగళవారం గ్రామ పెద్దలు పున్ణ ప్రారంభం చేశారు. ఈ రచ్చబండకు అనేక తెలుగు, ఒడిశా భాషా చిత్రాలు నిర్మాణం చేసిన చరిత్ర కూడా ఉంది. అప్పట్లో వెంకటేష్‌ నటించి, విజయం సాధించిన అబ్బాయిగారు సినిమా నిర్మాణం అధిక శాతం అక్కడే పూర్తి చేసుకుంది. 1987 నుండి 1995 వరకు అప్పటి గ్రామ సర్పంచ్‌ గా కరుటూరి కఅష్ణమూర్తి పనిచేసిన కాలంలో గ్రామ ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి పనులపై వచ్చినవారు సేద తీరేందుకు ప్రభుత్వ నిధులతో రచ్చబండ నిర్మాణం జరిగింది. ఇప్పటికది శిథిలావస్థకు చేరుకోవడంతో కఅష్ణమూర్తి కుమారుడు, ఎన్నారై రవికఅష్ణ సుమారు లక్ష రూపాయలు సొంత నిధులు వెచ్చించి, తన తండ్రి జ్ఞాపకార్థం పున్ణ నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వాకలపూడి సత్యనారాయణ, కరుటూరి భాస్కరరావు, పంచాయితీ మాజీ వార్డు మెంబరు అక్కిన సత్యనారాయణ, ఎంపీటీసీ కట్టా వెంకటేశ్వర రావు, గరిమెళ్ళ తాతారావు, అక్కిన వెంకట్రావు, కోడూరి హనుమంతరావు, కంకటాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.